(మెట్రో న్యూస్)
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి డి ఇందిరా
సురక్షిత్ బచ్పన్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా గురువారం అడ్డాకుల మండల కేంద్రంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు బాలల రక్షణ, హక్కులు, పోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి డి ఇందిరా హాజరై విద్యార్థులకు బాలల హక్కులు, వ్యక్తిగత భద్రత, లైంగిక వేధింపుల నివారణ, పోక్సో చట్టం, బాలల రక్షణ వ్యవస్థలపై అవగాహన కల్పించారు. బాలలు తమ హక్కుల గురించి తెలుసుకోవాలని, ఏవైనా వేధింపులు ఎదురైతే భయపడకుండా సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎంఈఓ ప్రకాష్, ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడు జె రఘునాథ్ రెడ్డి, గ్రామ సర్పంచ్ దశరథ్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.