Take a fresh look at your lifestyle.

బీఆర్ఎస్ ఆరోపణలు అబద్దం : డీసీపీ శిల్ప వల్లి

0 10

హైదరాబాద్ : మెట్రో న్యూస్
అసెంబ్లీ వద్ద సోమవారం చోటుచేసుకున్న ప‌రిణామాల‌పై డీసీపీ శిల్పవల్లి స్పందించారు.
బీఆర్ఎస్ నేతలు న‌లుపురంగు టీ షర్ట్స్ ధరించి, నినాదాలు చేస్తూ వ‌చ్చార‌ని చెప్పారు. వారి టీ షర్ట్స్పై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు రాశారని, అందుకే వారిని అసెంబ్లీ లోపలికి అనుమతించలేద‌న్నారు. నల్ల దుస్తులు ధరించి రావడంలో తప్పులేదని, నిరసన వ్యక్తం చేయడం కూడా తప్పు కాదని వెల్ల‌డించారు. కానీ బ్లాక్ టీషర్ట్స్ పైన స్లోగన్స్ రాసుకొని రావటమే తప్పు అని స్ప‌ష్టం చేశారు. అసెంబ్లీ ఎదుట టీ షర్ట్స్ తీసేసి బనియన్స్తో లోపలికి వెళ్తామన్నారని, దానికి తాము అంగీకరించలేదని చెప్పారు.బీఆర్ఎస్ నేతల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారనేది అవాస్తవమని, ఎవరి పట్ల కూడా అమర్యాదగా ప్రవర్తించలేదని వెల్ల‌డించారు. బీఆర్ఎస్ నేతలను నియంత్రించ‌డానికి చాలా ప్రయత్నించామన్నారు. తాము మహిళల పట్ల అగౌరవంగా ప్రవర్తించార‌ని చెబుతున్నారని, అది అబద్ధం అని డీసీపీ చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.