Take a fresh look at your lifestyle.

మూసీ ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణకు వెళ్ల‌కుండా అరెస్టు చేస్తారా..?

0 2

హైద‌రాబాద్ (మెట్రో న్యూస్‌):

  • ఖండించిన మాజీ మంత్రి హ‌రీశ్‌రావు

మూసీ ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లకుండా బీఆర్ఎస్ పార్టీ నాయ‌కుల‌ను అరెస్టు చేయ‌డంపై మాజీ మంత్రి హ‌రీశ్‌రావు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడాన్ని, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్, బీఆర్ఎస్ నేత కార్తీక్ రెడ్డి సహా ఇతర బిఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేయడాన్ని ఆయ‌న తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్ష నేతలను నిర్బంధిస్తూ ఎమర్జెన్సీ తరహా పాలన సాగించడం సిగ్గుచేటు అన్నారు. మీ నిర్లక్ష్యం వల్ల కరువు బారిన పడిన రైతులను, కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడం మానేసి.. మూసీ ప్రక్షాళన పేరుతో లక్షా 50 వేల కోట్లు ఖర్చు చేస్తామంటారా? కమిషన్లు దండుకోవడంపై ఉన్న శ్రద్ధ.. కరువు బాధిత రైతులను ఆదుకోవడంలో లేకపోవడం శోచనీయం! ఒక వైపు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ, మరోవైపు పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాల గొంతు ఎంతకాలం నొక్కుతారు? ఎన్ని రోజులు అణచివేస్తారని ఎక్స్ వేదికగా
ప్ర‌శ్నించారు.

Leave A Reply

Your email address will not be published.