Take a fresh look at your lifestyle.

PM Modi: జీడీపీ 7.8 శాతంగా న‌మోదు.. దేశ ప్ర‌జ‌ల‌కు కంగ్రాట్స్ చెప్పిన ప్ర‌ధాని..

0 12

PM Modi: భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ వృద్ధి రేటు 7.8 శాతంగా న‌మోదు అయిన విష‌యం తెలిసిందే. దీని ప‌ట్ల భార‌త ప్ర‌ధాని మోదీ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఓ సెల్ఫీ వీడియో పోస్టు చేశారు. వృద్ధి రేటు 7.8 శాతం ప్ర‌గ‌తి సాధించ‌డం ప‌ట్ల ఆయ‌న దేశ ప్ర‌జ‌ల‌కు కంగ్రాట్స్ చెప్పారు.

 

న్యూఢిల్లీ: భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ వృద్ధి రేటు 7.8 శాతంగా న‌మోదు అయిన విష‌యం తెలిసిందే. దీని ప‌ట్ల భార‌త ప్ర‌ధాని మోదీ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఓ సెల్ఫీ వీడియో పోస్టు చేశారు. వృద్ధి రేటు 7.8 శాతం ప్ర‌గ‌తి సాధించ‌డం ప‌ట్ల ఆయ‌న దేశ ప్ర‌జ‌ల‌కు కంగ్రాట్స్ చెప్పారు. ప్ర‌భుత్వంపై విప‌క్షాలు ఫ్ర‌ష్ట్రేష‌న్ వ్య‌క్తం చేసినా, ఎంత‌ నెగ‌టివ్ కామెంట్ చేసినా.. భార‌త్ మాత్రం ఆర్థిక వృద్ధిలో దూసుకెళ్తోంద‌న్నారు. ఒక‌వైపు కొన్ని దేశాలు యుద్ధాల్లో నిమ‌గ్నం కాగా, కొన్నింటి మ‌ధ్య క‌ల‌హాలు పెరుగుతుండ‌గా, భార‌త్ చేప‌డుతున్న స్థిర విధానాలు, చూపిస్తున్న శ్ర‌ద్ధ వ‌ల్ల జీడీపీ పెరిగిన‌ట్లు చెప్పారు.

కోవిడ్‌19 మ‌హ‌మ్మారి త‌ర్వాత ప్ర‌పంచ వ్యాప్తంగా అస్థిర‌త నెల‌కొన్న‌ద‌ని, కానీ ఇండియా మాత్రం అధిక ఆర్థిక వృద్ధి రేటును న‌మోదు చేసింద‌న్నారు. విప‌క్షాలు త‌మ అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేస్తున్నా.. దేశం మాత్రం ఆర్థిక వృద్ధిలో ముందుకు వెళ్తోంద‌న్నారు. కిర్గిస్తాన్‌లోని బిష్‌కేక్‌లో షాంఘై కోఆప‌రేష‌న్ ఆర్గ‌నైజేష‌న్ స‌ద‌స్సులో పాల్గొన్న ప్ర‌ధాని అక్క‌డే త‌న వీడియోను రికార్డు చేసి పంపారు. త‌న వీడియో సందేశంలో ప్ర‌ధాని మోదీ ఓ అపీల్ చేశారు.

అన‌వ‌స‌రంగా బంగారం కొనుగోలు చేయ‌రాదు అని, విదేశీ ప్ర‌యాణాల‌ను ఆపాల‌ని, విదేశాల్లో డెస్టినేష‌న్ వెడ్డింగ్‌ల‌ను కూడా ర‌ద్దు చేసుకోవాల‌ని కోరారు. సుస్థిర అభివృద్ధిలో స్వ‌యం స‌మృద్ధి ముఖ్య‌మైంద‌ని, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే స్వ‌దేశీ విధానాన్ని అవ‌లంబించాల‌న్నారు. ఆ సంబ‌రాల్లో భాగం అయ్యేందుకు త‌న‌తో పాటు ప్ర‌తిజ్ఞ చేయాల‌న్నారు.

Leave A Reply

Your email address will not be published.