Take a fresh look at your lifestyle.

కీలక ప్రయోగానికి సిద్ధ‌మైన ఇస్రో.. నింగిలోకి జీఎస్ఎల్వీ-ఎఫ్‌18 రాకెట్‌

0 16

(మెట్రో న్యూస్‌):

నావిక్ వ్యవస్థను బలోపేతం
చేయనున్న ఎన్వీఎస్-03 ఉప‌గ్ర‌హం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో కీలక అంతరిక్ష ప్రయోగానికి సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి శుక్ర‌వారం రాత్రి 11:51 గంటలకు జీఎస్ఎల్వీ-ఎఫ్‌18
రాకెట్‌ను ప్రయోగించేందుకు షెడ్యూల్ ఖరారు చేసింది. ఈ ప్రయోగం ద్వారా ఎన్వీఎస్-03 నావిగేషన్ ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపనున్నారు. భారత్ స్వదేశీ ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థ అయిన నావిక్ సామర్థ్యాన్ని మరింత పెంచే లక్ష్యంతో ఎన్వీఎస్-03 ఉపగ్రహాన్ని రూపొందించారు. ఇది రెండో తరం నావిగేషన్ ఉపగ్రహాల శ్రేణిలో కీలకమైనదిగా శాస్త్రవేత్త‌లు ప్ర‌క‌టించారు. ఈ ఉపగ్రహం ద్వారా భారత ప్రధాన భూభాగంతో పాటు దేశ సరిహద్దుల నుంచి సుమారు 1,500 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాలకు స్థాన నిర్ధారణ, నావిగేషన్, సమయ సేవలు మరింత మెరుగుపడే అవకాశం ఉంది. పౌర విమానాయానం, నౌకా యానం, రోడ్డు ర‌వాణా, ర‌క్ష‌ణ రంగం, విప‌త్తు నిర్వ‌హ‌ణలో ఖ‌చ్చిత‌త్వం మ‌రింత మెరుగుప‌డ‌నుంది.

Leave A Reply

Your email address will not be published.