(మెట్రో న్యూస్) :
సురక్షిత్ ప్లస్ హోదాను సాధించేందుకు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ తెలిపారు.మొబిలైజేషన్ ఎయిడ్స్ సురక్ష కార్యక్రమంలో జోగులాంబ గద్వాల జిల్లా సురక్షిత్ హోదాను సాధించడం అభినందనీయమని కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సంధ్య కిరణ్మయి, ప్రోగ్రాం ఆఫీసర్ రాజు తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సన్మాన్ సమా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ , జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సంధ్యా కిరణ్మయి జిల్లా ప్రోగ్రాం అధికారి రాజు లతో కలిసి హాజరయ్యారు. సురక్షిత్ హోదాను సాధించడంలో అధికార యంత్రాంగం కృషి అభినందనీయమని,ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో సురక్షిత్ ప్లస్ హోదాను సాధించే దిశగ సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ హెచ్ఐవి, ఎయిడ్స్ నివారణలో భాగంగ ప్రజలలో అవగాహన కల్పించడం, క్షేత్రస్థాయిలో మొబిలైజేషన్ కార్యక్రమాలను సమర్థవంతంగ అమలు చేయడం జరిగిందని తెలిపారు. వివిధ శాఖలు, ఆరోగ్య సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల సమిష్టి కృషితో జిల్లాకు గుర్తింపు లభించిందని తెలిపారు. సాధించిన ప్రగతిని కొనసాగిస్తూ, హెచ్ఐవి, ఎయిడ్స్ నివారణ చర్యలను మరింత విస్తృతం చేయాలన్నారు. ప్రజలకు అవసరమైన అవగాహన కార్యక్ర మాలను నిరంతరం నిర్వహించాలని అధికారులకు సూచించారు. అన్ని విభాగాలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ నిర్దేశిత లక్ష్యాలను సాధించడం ద్వారా జిల్లాను సురక్షిత్ ప్లస్ హోదా దిశగ తీసుకువెళ్లాలని తెలిపారు. అనంతరం జిల్లాలో సురక్షిత్ హోద సాధించేందుకు విశేష కృషి చేసిన పలువురు సిబ్బందిని ఈ సందర్భంగ ఉన్నతాధికారులు ఘనంగ సన్మానించారు. కార్యక్రమంలో దిశ సిపిఎం రమేష్ అండ్ టీం, స్వచ్ఛంద సంస్థల హోప్ ఎన్జీవో ప్రోగ్రాం అధికారి ఉదయ్ కుమార్ అండ్ టీం ఐసిటిసి స్టాఫ్, ఎల్ డబ్ల్యూ ఎస్ టీం, ఎన్ టి పి సిఎస్సి.2 .O..ఉమ్మడి మహబూబ్నగర్ ఆర్ట్ సిబ్బంది బృందం పాల్గొన్నారు.