Take a fresh look at your lifestyle.

నాగదేవతల నిలయం.. మన్నారశాల క్షేత్రం!

0 10

దట్టమైన వృలు.. ప్రకృతి ఒడిలో వేలాది నాగప్రతిమలు.. ఆలయ ప్రధాన ఆరాధనా సంప్రదాయంలో మహిళకు విశిష్ట స్థానం! భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలోని ఈ అరుదైన విశేషాలన్నింటికీ నిలయమే కేరళలోని మన్నారశాల శ్రీ నాగరాజ దేవాలయం. అలప్పుజ జిల్లా హరిపాడ్ సమీపంలో వెలసిన ఈ క్షేత్రం నాగారాధనకు ప్రసిద్ధి చెందింది. ప్రకృతి పరిరక్షణ, మాతృశక్తి ఆరాధన, ప్రాచీన విశ్వాసాలకు ప్రతీకగా నిలుస్తోంది.ఈ ఆలయానికి సంబంధించిన స్థలపురాణం పరశురామునితో ముడిపడి ఉంది. పురాణ విశ్వాసం ప్రకారం పరశురాముడు సముద్రం నుంచి కేరళ భూభాగాన్ని సృష్టించినప్పుడు నేలలోని ఉప్పదనం కారణంగా పంటలు పండలేదు. పరమశివుని సూచనతో నాగదేవతలను ప్రార్థించగా వారి అనుగ్రహంతో భూమి సారవంతమైందని చెబుతారు. ఈ ప్రాంతంలో నాగారాధనకు ఆ విధంగా శ్రీకారం చుట్టినట్లు స్థలపురాణం వివరిస్తుంది. ఆలయ పరిసరాల్లో చెట్ల కింద, కాలిబాటల పక్కన సుమారు 30 వేలకుపైగా నాగప్రతిమలు దర్శనమిస్తాయి. ప్రధాన దైవమైన నాగరాజుతోపాటు సర్పయక్షి, నాగయక్షి దేవతలను కూడా ఆరాధిస్తారు. ప్రకృతి సహజత్వాన్ని కాపాడుతూ కొనసాగుతున్న ఈ క్షేత్రం సందర్శకులకు విశిష్టమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది.నినిఈ ఆలయ ప్రత్యేకత మహిళా అర్చక సంప్రదాయం. వంశపారంపర్యంగా ఆలయ కుటుంబంలోని పెద్ద మహిళకు ప్రత్యేక పూజాధికారాలు ఉంటాయి. ఆమెను ‘వలియమ్మ’ లేదా ‘మన్నారశాల అమ్మ’ అని గౌరవంగా సంబోధిస్తారు. ముఖ్యమైన నాగపూజలు, ఉత్సవ క్రతువుల్లో ఆమె నిర్వహించే పాత్ర విశిష్టమైనది. క్క్ష్మశక్తికి భారతీయ ఆరాధనా వ్యవస్థలో ఉన్న ప్రాధాన్యాన్ని ఈ సంప్రదాయం చాటిచెబుతుంది. సంతానప్రాప్తిని కోరుకునే దంపతులు ఇక్కడ ‘ఉరుళి కమళ్తల’ అనే ప్రత్యేక ఆచారాన్ని పాటిస్తారు. ఇందులో సంప్రదాయ లోహపాత్రను పూజావిధానంలో బోర్లించి ఉంచుతారు. సంతానం కలిగిన తరువాత తిరిగి వచ్చి కృతజ్ఞతాపూర్వకంగా పూజలు నిర్వహిస్తారు. పాలతో కూడిన ‘నూరుం పాలుం’ నైవేద్యం కూడా ఇక్కడ ప్రసిద్ధి.మలయాళ తులామాసంలో జరిగే ‘ఆయిల్యం’ ఉత్సవం ఈ క్షేత్రానికి ప్రధాన ఆకర్షణ. వలియమ్మ నేతృత్వంలో నాగరాజస్వామి ఉత్సవమÖర్తిని ఊరేగింపుగా తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వేలాది మంది భక్తులు ఈ వేడుకల్లో పాల్గొంటారు.భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ‘అనంతశ్చాస్మి నాగానాం’ (10.29) అంటూ నాగులలో తాను అనంతుడినని ప్రకటించాడు. ఈ వాక్యం నాగారాధనకు ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యాన్ని తెలియజేస్తుంది. నాగులను పూజించడం వెనుక భక్తితోపాటు ప్రకృతిలోని జీవరాశుల పట్ల గౌరవభావం కూడా దాగి ఉంది.దైవారాధన అంటే కేవలం విగ్రహాలకు నమస్కరించడం మాత్రమే కాదు.. ప్రకృతిని ప్రేమించడం, జీవరాశులను సంరక్షించడం కూడా అనే శాశ్వత సందేశాన్ని మన్నారశాల నాగరాజ క్షేత్రం అందిస్తోంది.

Leave A Reply

Your email address will not be published.