Take a fresh look at your lifestyle.

వాతావరణం లో చోటు చేసుకున్న మార్పులు వర్షపాతంపై దాని ప్రభావం రైతులకు అవగాహన కల్పించాలి. ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ.

0 5

మెట్రో న్యూస్ అచ్చంపేట (అక్టోబర్ 30):

అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో టిపిసిసి ఉపాధ్యక్షులు డిసిసి అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ సమావేశంలో మండల పరిధిలోని వివిధ గ్రామాలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలు, మౌలిక సదుపాయాల రూప కల్పన తదితర అంశాలపై చర్చించారు. ప్రజాప్రతినిధులు,అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని సమావేశంలో సూచించారు. ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ, మండల సమగ్ర అభివృద్ధికి కృషి చేయడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని ఆదేశించారు. అనంతరం ఎల్ నినో ప్రభావంపై చర్చించారు. ఎల్ నినో ప్రభావంతో వాతావరణంలో చోటుచేసుకునే మార్పులు, వర్షపాతంపై దాని ప్రభావం, వ్యవసాయ రంగానికి ఎదురయ్యే సవాళ్లు, రైతులు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు వంటి అంశాలపై చర్చించారు.
వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులకు అవసరమైన అవగాహన కల్పించడం, వ్యవసాయ రంగానికి సంబంధించిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడం వంటి అంశాలపై దృష్టి సారించాలని,
అమ్రాబాద్ మండలాన్ని కరువు మండలం గా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగిందని ఎమ్మెల్యే గారు పేర్కొనడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు, గ్రామ సర్పంచులు,తదితరులు, పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.