Take a fresh look at your lifestyle.

12 మంది సీనియ‌ర్ ఐఎఎస్ అధికారుల బ‌దిలీ…..

0 2

హైద‌రాబాద్ (మెట్రో న్యూస్‌):

  • పంచాయ‌తీరాజ్ స్పెష‌ల్ చీఫ్
    సెక్రెట‌రీగా న‌వీన్ మిట్ట‌ల్‌
  • జ‌యేశ్ రంజ‌న్‌కు అట‌వీశాఖ‌
    ఇంధ‌న శాఖ‌కు వికాస్ రాజ్‌
  • ఉత్త‌ర్వులు జారీ చేసిన ప్ర‌భుత్వం

తెలంగాణలో 12 మంది సీనియ‌ర్ ఐఎఎస్ అధికారులకు కొత్త బాధ్య‌త‌లు అప్ప‌గిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం బుధ‌వారం నాడు ఉత్త‌ర్వులు జారీ చేసింది. అధికారుల బదిలీలు, పోస్టింగుల‌పై నిర్ణ‌యం తీసుకుంది. లూప్‌లైన్ పోస్టింగుల‌తో కొంత‌కాలంగా అసంతృప్తిగా ఉన్న సీనియ‌ర్ అధికారి జయేష్ రంజన్‌ను అన్ని బాధ్య‌త‌ల నుంచి రిలీవ్ చేయ‌డ‌మే కాకుండా, కొత్త‌గా అప్ర‌ధాన‌మైన అట‌వీ, పర్యావరణం అప్ప‌గించ‌డం గ‌మ‌నార్హం. రవాణా, రోడ్లు భవనాల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న వికాస్ రాజ్‌ను ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బదిలీ చేశారు. అక్క‌డ ఉన్న నవీన్ మిట్టల్‌ను రిలీవ్ చేసి పంచాయ‌తీరాజ్‌, గ్రామీణ అభివృద్ధి శాఖ‌లో స్పెష‌ల్ చీఫ్ సెక్రెట‌రీగా నియ‌మించారు. వాణి ప్రసాద్‌కు క్రీడలు, క్రీడా శాఖ డైరెక్టర్, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ డైరెక్టర్ జనరల్ బాధ్యతలను అదనంగా అప్పగించారు. ఎం. దానకిశోర్‌ను ఇక ఎలాంటి అద‌న‌పు బాధ్య‌త‌లు లేకుండా, గ‌వ‌ర్న‌ర్ స్పెషల్ చీఫ్ సెక్రెట‌రీగా మాత్ర‌మే వ్య‌వ‌హ‌రించ‌నున్నారు.

షైలజా రామయ్యర్ రెవెన్యూ (దేవాదాయ) శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమితులయ్యారు. బీసీ సంక్షేమ శాఖ‌ను చూస్తున్న రాహుల్ బొజ్జాకు గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బాధ్యతలను అదనంగా అప్పగించారు. కె. ఇలంబర్తి రవాణా, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శిగా నియమించ‌గా, స‌ర్ఫ‌రాజ్ అహ్మద్‌కు హెచ్ఎండీఏ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. అలాగే గ్రేటర్ జీహెచ్ఎంసీ, మల్కాజిగిరి, సైబ‌రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారిగా కూడా స‌ర్ఫ‌రాజ్ బాధ్యతలు నిర్వహిస్తారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ స్పెషల్ సెక్రటరీగా శృతి ఓజా, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా మహమ్మద్ ముషరఫ్ అలీ ఫరూఖీకి పోస్టింగ్ ఇచ్చారు. రైతు డిస్కం సీఎండీగా అద‌న‌పు బాధ్య‌త‌లు కూడా ఫ‌రూఖీ చూస్తారు. డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా, టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి. పాటిల్‌కు అద‌నంగా టీజీ రెడ్కో వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలను ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.