Take a fresh look at your lifestyle.

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

0 4

(మెట్రో న్యూస్):

క్వింటాలుకు ఏ-గ్రేడ్‌కు రూ.2,461.. సాధారణ రకానికి రూ.2,441

కొల్చారం మండలం నాయిని జలాల్పూర్ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పీఏసీఎస్ చైర్మన్ సత్యనారాయణ గౌడ్ ప్రారంభించారు. గ్రామ దేవి సింగ్ అధ్యక్షతన గురువారం కొబ్బరికాయ కొట్టి, రిబ్బన్ కట్ చేసి కేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా అధికారులు, కేంద్రం నిర్వాహకులు మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర ప్రకారం ఏ-గ్రేడ్ ధాన్యానికి క్వింటాలుకు రూ.2,461, సాధారణ రకానికి రూ.2,441 చెల్లించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం గుర్తించిన ఏడు సన్న రకాల ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్ అందించనున్నట్లు పేర్కొన్నారు. రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చే ముందు తేమ శాతం 17కు మించకుండా చూసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నాయిని వెంకట నరసింహులు, పీఏసీఎస్ ఉపాధ్యక్షుడు గంపల లక్ష్మయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిన్న రాయన్న, లక్ష్మయ్య, పంచాయతీ కార్యదర్శి మౌనిక, కొనుగోలు కేంద్రం ఇన్‌చార్జులు గొల్ల పాండరి, చందర్ నాయక్, వార్డు సభ్యులు గంగ స్వామి, మధులత, కుమారస్వామి, ఫీల్డ్ అసిస్టెంట్ సత్యనారాయణ, నాయకులు నాయిని విట్టల్, దాసు, నర్సింలు, ఏగొండతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.