Take a fresh look at your lifestyle.

క్రిటికల్ మినరల్స్ రంగాన్ని బ‌లోపేతం చేస్తాం

0 5

ఢిల్లీ (మెట్రో న్యూస్‌):

భారత్, ఆస్ట్రేలియా మరియు ఇతర దేశాల మధ్య గనులు, క్రిటికల్ మినరల్స్, ఆధునిక సాంకేతికత, ప్రాసెసింగ్ రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఈనెల 25 నుంచి 30 వరకు ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. సిడ్నీ, మెల్‌బోర్న్ నగరాల్లో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొని.. వివిధ దేశాల ప్రభుత్వ ప్రతినిధులు, మైనింగ్ కంపెనీలు, పరిశోధనా సంస్థలు, పారిశ్రామికవేత్తలతో విస్తృత చర్చలు జరపనున్నారు. భారత్‌లో పెరుగుతున్న ఇండస్ట్రియల్, క్లీన్ ఎనర్జీ అవసరాలకు అనుగుణంగా క్రిటికల్ మినరల్స్ సరఫరాను బలోపేతం చేయడం, వివిధ దేశాలనుంచి ఉన్నటువంటి వనరుల ద్వారా వాటిని సమకూర్చుకునే అవకాశాలను పెంచుకోవడం వంటి అంశాలు.. కిషన్ రెడ్డి పర్యటన ప్రధాన ఉద్దేశం.

భారతదేశంలోని మైనింగ్ ప్రాజెక్టులలో పెట్టుబడులు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, సంయుక్త పరిశోధనలు, నైపుణ్యాభివృద్ధి, ఎక్స్‌ప్లొరేషన్ తదితర అంశాలపైనా కిషన్ రెడ్డి ఈ పర్యటనలో దృష్టి సారించనున్నారు. విస్తారమైన ఖనిజ వనరులు, అధునాతన మైనింగ్ టెక్నాలజీ కలిగిన దేశాలతో ముఖ్యంగా.. ఆస్ట్రేలియాతో సహకారం.. మినరల్ ఎక్స్‌ప్లొరేషన్, మైనింగ్, వ్యాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ తయారీ వరకు.. భారతదేశానికి ప్రతిఅంశంలోనూ కీలకం కానుంది.

Leave A Reply

Your email address will not be published.