Take a fresh look at your lifestyle.

శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలి

0 4

(మెట్రో న్యూస్):

తెలంగాణ రక్షణ సేన (టిఆర్‌ఎస్‌) పార్టీ నాయకులు.

ధరూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో నూతన ఇంచార్జి ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన బి.తారకను తెలంగాణ రక్షణ సేన (టిఆర్‌ఎస్‌) పార్టీ ధరూర్‌ మండల ముఖ్య నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మహిళా ఎస్సై బి. తారకకు పూల బొకే అందజేసి, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ధరూర్‌ మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజల భద్రతకు పోలీస్‌ శాఖ ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు సేవలు అందించాలని కోరారు.
ప్రజలకు, పోలీసు శాఖకు మధ్య సత్సంబంధాలు కొనసాగిస్తూ, ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని పార్టీ నాయకులు ఆకాంక్షించారు.
చట్టాన్ని ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటూ, ప్రజలు ప్రశాంతత వాతావరణంలో జీవించేలా పోలీసులు నిరంతరం కృషి చేయాలని వారు కోరారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన (టిఆర్‌ఎస్‌) పార్టీ ధరూర్‌ మండల ముఖ్య నాయకులు గోవిందు, అడివి ఆంజనేయులు, మల్దకల్,ఆంజనేయులు, జమ్మన్న,మునెప్ప,వీరన్న,జగదీష్, వెంకటేష్,శాంతన్న,గోవిందు, ఎల్లప్ప,మహానంది,రామకృష్ణ,కేకే. గోవిందు,ఆంజనేయులు,కృష్ణ,మద్దిలేటి నర్సింహా తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.