(మెట్రో న్యూస్) :
ప్రత్యేక ప్రణాళికతో జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు స్పీడ్ అప్ కావాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మంజూరైన ప్రతి ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు.గురువారం కలెక్టర్ ప్రతిమసింగ్ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై ఒక ప్రకటన విడుదల చేస్తూ మాట్లాడారు . జిల్లాలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు స్పీడ్ అప్ కావడానికి మండలానికి ఆరుగురు ప్రత్యేక అధికారులను నియమించినట్లు వివరించారు.
ఒక్కో అధికారి నాలుగైదు గ్రామాల్లో జరిగే ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను పరిశీలించి, మొదటి ,రెండో విడతలో పెండింగ్ లో ఉన్న ఇందిరమ్మ ఇంటి నిర్మాణాల లబ్ధిదారులను మోటివేషన్ చేసి నిర్మాణాలు పూర్తయ్యేలా ప్రణాళికలు చేయాలని ఆదేశించారు.
రానున్న పది రోజుల్లో మొదలుకాని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు మొదలు పెట్టేందుకే ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
క్షేత్రస్థాయిలో ఇంటి నిర్మాణం వేగవంతంగా అయ్యేందుకు తీసుకోవలసిన చర్యలను తెలుసుకొని, ఆ దిశగా కృషి చేయాలన్నారు.
ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, ఇళ్ల నిర్మాణాల విషయంలో
ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకొని, అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు.
మండలాల్లో నియామకమైన ప్రత్యేక అధికారులు గ్రామాల్లో మొదటి, రెండో విడతలో ఇండ్లు మొదలుపెట్టని లబ్ధిదారులతోని నేరుగా కలిసి వారి ఇంటి నిర్మాణాలు పూర్తి చేసేలా అవగాహన కల్పించలన్నారు.
ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు అతి తక్కువ ఖర్చుతో ఇందిరమ్మ ఇల్లు కట్టుకునేలా వివరించాలన్నారు.
ఆర్ధికంగా స్తోమత లేని ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల పై ప్రత్యేక చొరవ చూపి తక్కువ ఖర్చుల తో ఇల్లు పూర్తయ్యే విధంగా సూచించాలన్నారు