Take a fresh look at your lifestyle.

జన సందోహాల మధ్య మంత్రి అలైబలై భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు.

0 4

మెట్రో న్యూస్ 

జన సందోహాల మధ్య మంత్రి దామోదర్ రాజనర్సింహ అలైబలై కార్యక్రమం ధూమ్ ధామ్ గా కిక్కిరిసిన కాంగ్రెస్ కార్యకర్తల మధ్య జరిగింది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆధ్వర్యంలోఏర్పాటు చేసిన అలై బలైకార్యక్రమం చౌటుకూరు మండలం తాడదాం పల్లి చౌరస్తా లోని ఒ ఫంక్షన్ హాల్ లో ధూంధాముగా సాగింది. ముందుగా మంత్రి దామోదర్ రాజనర్సింహ అందోల్ నియోజకవర్గం కు మంజూరు చేసిన 2000 కోట్ల అభివృద్ధి పనులను ప్రత్యేక స్క్రీన్ ద్వారా మంత్రితోపాటు నాయకులు కార్యకర్తలు వీక్షించారు. అనంతరం నియోజకవర్గంలోని అన్ని మండలాల ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు మండలాల వారీగా ఆయనను కలుసుకొని దసరా శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీఅధ్యక్షులు (డిసిసి) చంద్రశేఖర్ రెడ్డి, గ్రంధాలయ చైర్మన్ అంజయ్య, జోగిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి, జోగిపేట మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ కృష్ణారెడ్డి ,చిట్టిబాబు, జోగిపేట కాంగ్రెస్ కౌన్సిలర్లు నియోజకవర్గంలోని అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సర్పంచులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.