(మెట్రో న్యూస్):
ఉమ్మడి మెదక్ జిల్లా ఎస్‌జీఎఫ్ అండర్-17 క్రికెట్ జట్టుకు జోగిపేట కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌కు చెందిన పదకంటి శశిధర్ ఎంపికయ్యాడు. పుల్కల్ మండలం ముదిమాణిక్యం గ్రామానికి చెందిన శశిధర్ లెగ్ స్పిన్నర్‌గా జిల్లా జట్టులో స్థానం సంపాదించాడు. జిల్లా జట్టుకు ఎంపికైన శశిధర్‌ను జోగిపేట సీఐ అనిల్‌కుమార్ శాలువాతో సత్కరించి అభినందించారు. క్రికెట్‌లో మరింత రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. జిల్లా జట్టుకు ఎంపిక కావడం పట్ల విద్యార్థి కుటుంబ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.