(మెట్రో న్యూస్):
ఈనెల 25 26 తేదీల్లో జరిగే మహా ధర్నాను విజయవంతం చేయాలని సంగారెడ్డి జిల్లా హత్నూర మండల పరిధిలోని దౌల్తాబాద్ లో సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం కరపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి సాయిలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను ఉపసమించుకోవాలని కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం నలభై రెండు వేలు నిర్ణయించాలని చట్టపరమైన సౌకర్యాలు అమలు కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఈనెల 25 26వ తేదీల్లో హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద జరిగే మహా ధర్నా లో కార్మికులు అర్షకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐయు యూనియన్ నాయకులు శబిద్ అలీ, వీరేశం, బాలరాజు, సుధాకర్, శ్రీనివాస్, యాదగిరి, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.