Take a fresh look at your lifestyle.

ఫైర్ బ్రాండ్ టు సిఎం:

0 3

హైదరాబాద్ : మెట్రో న్యూస్

సమరమే ఆయన ఊపిరి..

వ్యూహమే ఆయన బాట!

నేడు ఆయన పుట్టినరోజు

రాజకీయాల్లో సునాయాసంగా గెలిచి అగ్రపీఠం ఎక్కినవారు కొందరైతే.. పడిన ప్రతిసారీ రెట్టింపు ఉత్సాహంతో లేచి, ప్రత్యర్థుల వ్యూహాలను తిప్పికొడుతూ శిఖరాలను అధిరోహించేవారు కొందరే. ఆ రెండో కోవకు చెందిన నేతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
స్థానిక సంస్థల్లో ఇండిపెండెంట్‌గా ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రయాణం, నేడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించే స్థాయికి చేరిందంటే దాని వెనుక ఉన్నది కేవలం ఆయన ‘మాస్ ఇమేజ్’, ‘పోరాట పటిమ’ మాత్రమే కాదు.. ప్రత్యర్థులను పసిగట్టే పదునైన రాజకీయ వ్యూహం!జెడ్పీటీసీ నుంచి పీసీసీ అధ్యక్షుడి వరకు: అడుగడుగునా సవాళ్లే అయినా అన్నింటిని తట్టుకున్నారు, తలపడ్డారు, నిలబడ్డారు
మహబూబ్‌నగర్ జిల్లా కొండారెడ్డిపల్లి గ్రామం నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి, 2006లో మిడ్జిల్ జెడ్పీటీసీగా, 2007లో స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్సీగా గెలిచి తన రాజకీయ చాతుర్యాన్ని నిరూపించుకున్నారు.
2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, అసెంబ్లీలో ప్రతిపక్షానికి పార్టీ తరపున ముఖ్యమైన గొంతుకగా మారారు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఎదురైనప్పటికీ నిరాశ చెందకుండా 2019లో మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేశారు. దేశంలోనే రెండో అతి పెద్ద మల్కాజిగిరి పార్లమెంట్ నుంచి ఎంపీగా గెలిచి తన సత్తా ఏంటో మళ్లీ చాటారు.2021లో తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్, నిస్తేజంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విజయతీరాలకు చేర్చి ముఖ్యమంత్రిగా పీఠమెక్కారు.హైడ్రా’నుంచి ‘విజన్ 2047’ దాకా
సిఎం పీఠం ఎక్కినప్పటినుంచి రేవంత్ రెడ్డి నిర్ణయాల్లో వేగం, పదును స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఉచిత బస్సు ప్రయాణం, గృహ జ్యోతి, సబ్సిడీ సిలిండర్లు వంటి పథకాలను అమలు చేస్తూ సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చారు. హైదరాబాద్ నగరంలో చెరువులు, ఆక్రమణలపై హైడ్రా ద్వారా తీసుకుంటున్న కఠిన చర్యలు సామాన్య ప్రజల్లో ఆయనకు విశేష ఆదరణ తెచ్చిపెట్టాయి.రాష్ట్ర భవిష్యత్తు కోసం క్యూర్, ప్యూర్ రేర్ అనే మూడు ప్రతిపాదనలతో పారిశ్రామిక, ఆర్థిక అభివృద్ధికి కొత్త రోడ్‌మ్యాప్ రూపొందించారు.
రాజకీయాల్లో ప్రత్యర్థులపై విరుచుకుపడే విషయంలో రేవంత్ రెడ్డి శైలి ప్రత్యేకమైనది. అదే సమయంలో, పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌తో నీటి వివాదాలు లేదా మౌలిక వసతుల పనులపై రాష్ట్రాభివృద్ధికి అవసరమైన సమన్వయం సాధించేందుకు కేంద్రంతోనూ, పొరుగు రాష్ట్రాలతోనూ చర్చలు జరుపుతున్నారు.
ఎన్నికల హామీలను నెరవేర్చడం, ఆదాయ వనరులను పెంచుకోవడం, ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టడం వంటి సవాళ్లు ముందున్నప్పటికీ.. తనదైన స్పీడుతో, మాటల పదునుతో, దూకుడు రాజకీయం ప్లస్ వ్యూహాత్మక పాలనతో తెలంగాణ రాజకీయ తెరపై రేవంత్ రెడ్డి తన సమున్నత ముద్రను వేస్తూ ముందుకు సాగుతున్నారు!

Leave A Reply

Your email address will not be published.