హైదరాబాద్ : మెట్రో న్యూస్
రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆర్టీసీ దీపావళి పండుగకు కానుక ప్రకటించింది మెట్రో, ఆర్టీసీ ఉమ్మడి ప్రయాణ పాస్ ధరలను భారీగా తగ్గించింది ప్రజలపై ప్రయాణ ఖర్చుల భారం తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ప్రజా రవాణా సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయంతీసుకోని రోజువారీ ఉమ్మడి ప్రయాణ పాస్ ధర రూ.400 నుంచి రూ.275కు తగ్గింపుచేసింది నెలవారీ ఉమ్మడి ప్రయాణ పాస్ ధర రూ.8,500 నుంచి రూ.4,000కు తగ్గింపు చేసింది నెలవారీ పాస్ ద్వారా వినియోగదారులకు రూ.4,500 ఆదా కాగా రోజువారీ పాస్ వినియోగదారులకు రూ.125 మేరకు ప్రయోజనం చేకూరనుంది రోజువారీ పాస్‌లో మెట్రోకు రూ.200, ఆర్టీసీకి రూ.75 కేటాయింపు చేస్తూ రోజుకు నాలుగు సింగిల్ జర్నీలకు అనుమతి ఇచ్చింది నెలవారీ పాస్‌లో మెట్రోకు రూ.3,000, ఆర్టీసీకి రూ.1,000 కేటాయింపు చేసింది నెలలో గరిష్టంగా 50 మెట్రో సింగిల్ ట్రిప్పులకు అనుమతి ఇచ్చింది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికి ఎలాంటి పరిమితులు లేవు నవంబర్ 8 నుంచి తగ్గించిన ధరలు అమల్లోకి వస్తాయని ప్రయాణికుల ఆర్థిక ప్రయోజనాలకు ప్రభుత్వం పెద్దపీట వేసిందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు సామాన్య ప్రజలకు ఈ నిర్ణయం ఎంతో ఊరటనిస్తుందని ఆయన పేర్కొన్నారు.