నిజామాబాద్, నవంబర్ 5( మెట్రోన్యూస్ )
నగర శివారులోని
మాధవనగర్ ఆర్వోబీ వద్ద రూరల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గురువారం రూరల్ బీఆర్ఎస్ ఇన్ఛార్జి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు బాజిడ్డి జగన్మోహన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బంగా బాజిరెడ్డి జగన్మోహన్ మాట్లాడుతూ 2015–16లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే రైల్వే ఓవర్ వంతెన కోసం 60శాతం నిధులు మంజూరయ్యాయన్నారు.కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు అప్పటి రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నిధుల సమీకరణలో తీవ్రంగా కృషి చేసి సాధించారన్నారు. అప్పటి ఎంపీ కవిత హయాంలో ఈ నిధులు వచ్చాయన్నారు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ,బీజేపీ ఆర్వోబీని తామే సాధించాయని గొప్పలు చెప్పుకుంటున్నాయని ఎద్దేవా చేశారు. ప్రజలు ఇదంతా గమనిస్తున్నారన్నారు.
ఆర్వోబీకీ బీజం పడిందే బీఆర్ఎస్ హయాంలో అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాజిరెడ్డి రమాకాంత్, తిర్మల్ పటేల్, పద్మారావు, కోర్వ దేవేందర్, అజయ్,మల్లెపూల నరసింహ చారీ,రంగా, బంటు దాస్, ఖానాపూర్ హరి, బట్టు సంజయ్ తదితరులు పాల్గొన్నారు.