Take a fresh look at your lifestyle.

బీసీల ఆత్మ‌గౌర‌వాన్ని దెబ్బ‌తీసిన ప్ర‌భుత్వం

0 5

హైద‌రాబాద్ (మెట్రో న్యూస్‌):

కమ్యూనిటీ హాళ్ల‌పై ప్రభుత్వ పెత్తనం ఏంటి

శాసన మండలి ప్రతిపక్ష
నేత మధుసూదనా చారి

బీసీ కులాల ఆత్మగౌరవ భవనాలపై కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని శాస‌న‌మండ‌లిలో ప్ర‌తిప‌క్ష నేత మ‌ధుసూద‌నాచారి తీవ్రంగా ఖండించారు. బీసీ బిడ్డ అయిన మంత్రి పొన్నం బీసీలా ఆత్మగౌరవం దెబ్బ తీస్తున్నాడని విమ‌ర్శించారు. గురువారం తెలంగాణ భ‌వ‌న్లో మాజీ మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్‌, శ్రీ‌నివాస్‌గౌడ్‌, ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్‌, విప్ వివేకానంద‌, కాలేరు వెంక‌టేశ్‌తో క‌లిసి ఆయ‌న ప్రెస్ మీట్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా బీఆర్ఎస్ నేత‌లు మాట్లాడుతూ, ఆనాడు బీసీల ఆత్మగౌరవం కాపాడాలని కేసీఆర్ విలువైన స్థలాలు ఇచ్చారని గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ బీసీల ద్రోహి పార్టీలా మారిందన్నారు. ప్రభుత్వ భూములను ఆయా కుల‌ సంఘాలకు బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. ప్రతి కులానికి ఒక ట్రస్ట్ ఉండాలని కేసీఆర్ చెప్పారు. బిసిలపై ఆధిపత్యం, అజమాయిషీ ఉండకుండా బిఆర్ఎస్ ప్రభుత్వం భవనాలు ఇచ్చింద‌న్నారు. అయితే రేవంత్ స‌ర్కారు ఆత్మ‌గౌర‌వ భ‌వ‌నాల‌పై ఆధిప‌త్యం, నియంత్ర‌ణ కోసం రాత్రికిరాత్రి జీవో 14 తీసుకొచ్చింద‌న్నారు. కేసీఆర్ ఇచ్చిన ఆత్మ గౌరవ భవనాలపై కమిటీల పెత్తనం ఏంటి రేవంత్ రెడ్డి అని ప్ర‌శ్నించారు. కోకాపేట్లో బీసీ ఆత్మ గౌరవ భవనం కేసీఆర్ ఇచ్చారన్నారు. త‌క్ష‌ణ‌మే చీక‌టి జీవోను ర‌ద్దుచేయ‌క‌పోతే… త్వ‌ర‌లో చ‌లో కోకాపేట కార్య‌క్ర‌మాన్ని చేప‌డ‌తామ‌న్నారు. జీవో ర‌ద్దు చేసే వ‌ర‌కు పోరాడ‌తామ‌న్నారు.

Leave A Reply

Your email address will not be published.