Take a fresh look at your lifestyle.

గణేష్‌ ఉత్సవాల నేపథ్యంలో విద్యుత్‌ సరఫరా ఏర్పాట్లపై సమీక్ష.

0 3

(మెట్రో న్యూస్):

భూపాలపల్లి రేగొండ మండలం పాండవుల గుట్ట సమీపంలో ఎస్‌ఈ (ఆపరేషన్స్‌) నాగేల్లి సదానందం మంగళవారం పాండవులగుట్ట వద్ద గల 132/33 కేవీ సబ్‌స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా సబ్‌స్టేషన్‌లోని విద్యుత్‌ పరికరాలు, నిర్వహణ పరిస్థితి, విద్యుత్‌ సరఫరా తీరును స్థానిక ట్రాన్స్కో దయ్యాల రమేష్ తో కలిసి పరిశీలించారు.గణేష్‌ ఉత్సవాల నేపథ్యంలో విద్యుత్‌ వినియోగం పెరిగే అవకాశం ఉన్నందున ముందస్తుగా చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో సమీక్షించారు. ఉత్సవాల సమయంలో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. సబ్‌స్టేషన్‌ పరిధిలోని విద్యుత్‌ లైన్లు, పరికరాలపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్ఈ సదానందం ఆదేశించారు.

Leave A Reply

Your email address will not be published.