-రాయికోడ్ తహశీల్దార్ ఆశాజ్యోతి
మెట్రో న్యూస్ రాయికోడ్:
భూ కమతాల సమస్యల శాశ్వత పరిష్కారానికే భూ భారతి-భూ రీ సర్వే కార్యక్రమంను ప్రభుత్వం చేపట్టిందని రాయికోడ్ తహశీల్దార్ ఆశాజ్యోతి అన్నారు.గ్రామాల్లో నెలకొన్న భూ తగాదాలను శాశ్వతంగా రూపుమాపడానికీ ప్రభుత్వం ఈ భూ భారతి-భూ రీ సర్వే కార్యక్రమాన్ని చేపట్టిందని,రైతులు సహకారాన్ని అందించాలన్నారు.మంగళవారం మండలంలోని అల్లాపూర్ గ్రామంలో భూ భారతి-భూ రీ సర్వేను ప్రారంభించారు. ఈసందర్భంగా తహశీల్దార్ ఆశాజ్యోతి,మాట్లాడుతూ ఈ భూ భారతి-భూ రీ సర్వే ముఖ్య ఉద్దేశ్యం రికార్డులను ఆధునికీకరించడం,ఖచ్చితత్వం పెంచడం,సరిహద్దు వివాదాలను పరిష్కరించడం,యజమాని హక్కులను స్పష్టం చేయడం,భూమి కొలతలను సరిచేసి,ఆధునిక సాంకేతిక పరికరంతో డిజిటల్ రికార్డులను రూపొందించబడుతుందన్నారు.భూ రీ సర్వేతో సరిహద్దు వివాదాల పరిష్కారం,ఖచ్చితమైన కొలతలు,డిజిటల్ రికార్డుల నిర్వహణ,హక్కుల స్పష్టత,భూ ఆక్రమణలను నివారించవచ్చని,అర్హుల అందరికీ ప్రభుత్వం అందించే పథకాలు అందేలా,స్పష్టమైన సబ్-డివిజన్ మరియు సరిహద్దులు,డిజిటల్ సర్వేతో కొత్త రికార్డులను రూపొందించడం జరుగుతుందన్నారు.భూ రీ సర్వేతో భూ తగాదాలు తగ్గుతాయని,సర్వే జరిగే సమయంలో పంతాలు,పట్టింపులకు పోకుండా ప్రజా ప్రతినిధులు,రైతులు,ప్రజలు,నాయకులు సర్వే సిబ్బందితో సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ చరణ్,జీపిఓ దశరథ్,సర్వేయర్,రైతులు సంగయ్య స్వామి,రాజు,సుభాష్ గ్రామస్తులు పాల్గొన్నారు.