Take a fresh look at your lifestyle.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రల్లోనే ధాన్యాన్ని విక్రయించాలి

0 3

-వ్యవసాయ రంగంపై ఎల్ నినో ప్రభావం ఉన్నందున వ్యవసాయ అధికారులు సూచించిన పంటలను రైతులు వెయ్యాలి
-పలు గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన సహకార సంఘం చైర్మన్ ఒగ్గు దామోదర్

మెట్రో న్యూస్ బెజ్జంకి:

రైతులు పండించిన పరిధాన్యాన్ని దళారులకు అమ్మకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ దామోదర్ పేర్కొన్నారు. సోమవారం తోటపల్లి, వీరాపూర్, ముత్తన్నపేట ,బెజ్జంకి క్రాసింగ్ , గుగ్గిళ్ళ, రేగులపల్లి, చీలాపూర్ గ్రామాల్లో సహకార సంఘం,ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించి మాట్లాడుతూ… ఏ గ్రేడ్ రూ..2461, బి గ్రేడ్ రకానికి రూ..2441 ప్రభుత్వం ధర నిర్ణయించడం జరిగిందన్నారు. 500 రూపాయల బోనస్ ఇవ్వడం జరుగుతుందని, పట్టిన వడ్లను తీసుకురావాలన్నారు. అలాగే మ్యాచర్ వచ్చే విధంగా చూసుకోవాలన్నారు.ఎల్ నినో ప్రభావం వ్యవసాయం అరంగంపై చూపిస్తున్నందున వ్యవసాయ అధికారులు సూచించిన పంటలను మాత్రమే రైతులు వేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పర్ష సంతోష్, మండల అధ్యక్షుడు లింగాల శ్రీనివాస్ , తోటపల్లి సర్పంచ్ కవ్వంపల్లి అశ్విని, వీరాపూర్ సర్పంచ్ సతీష్, ముత్తన్నపేట సర్పంచ్ గుర్రాల అనురాధ, బెజ్జంకి క్రాసింగ్ సర్పంచ్ గాజ్జే రవళి, రేగులపల్లి సర్పంచ్ లక్ష్మి, గుగ్గిళ్ళ సర్పంచ్ మల్లయ్య, డైరెక్టర్లు బోయినపల్లి చందర్ రావు, బైర సంతోష్,శ్రీనివాస్ రెడ్డి,కుంట హరికృష్ణ, ఇస్కిల్ల ఐలయ్య, ఉపసర్పంచ్ మచ్చ కుమార్, నాయకులు రత్నాకర్ రెడ్డి, జెల్లా ప్రభాకర్, రావుల నర్సయ్య, మండల ఉపాధ్యక్షుడు గుర్రం రాజిరెడ్డి, బోయిని ప్రశాంత్, రమేష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.