Take a fresh look at your lifestyle.

ప్రభుత్వ బాలికల పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా కలెక్టర్ హైమావతి

0 5

-విద్యార్థులకు రుచికరమైన భోజనాన్ని అందించాలి

మెట్రో న్యూస్ బెజ్జంకి :

మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి ఆకస్మికంగా సందర్శించారు. మధ్యాహ్న భోజన ప్రక్రియను క్షేత్రస్థాయిలో అన్నం ,మిల్ మేకర్, సాంబార్ పరిశీలించి కూరల నాణ్యత ఏ విధంగా ఉందో విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల వాతావరణం బాగుంది విద్యార్థులకు చదువు భోజనం విషయంలో ఇలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ,ప్రిన్సిపాల్ కు, ఉపాధ్యాయ బృందానికి ఆదేశించారు. కలెక్టర్ వెంట తహసిల్దార్ శ్రీకాంత్ ,సర్పంచ్ బొల్లం పెద్దన్న, ఉప సర్పంచ్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.