Take a fresh look at your lifestyle.

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు

0 3

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించాలి
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మెట్రో న్యూస్ /జిన్నారం నవంబర్ 02:-

రైతులు దళారులను నమ్మి మోసపోవదని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించాలని పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. సోమవారం జిన్నారం మున్సిపల్ పరిధిలోని సోలక్పల్లి లో వర్షాకాలం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక నాయకులతో కలిసి ఆయన ప్రారంభించారు. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్య విక్రయించాలని దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ప్రభుత్వం రాష్ట్ర రైతులకు బోనస్ బకాయిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జనార్ధన్, కమిషనర్ నరేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు ఆయా వార్డు కౌన్సిలర్, సహకార సంఘం డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.