(మెట్రో ఈవినింగ్స్):
వ్యవసాయానికి విద్యుత్ కోతలు విధించడాన్ని నిరసిస్తూ బీజేపీ నాయకులు బుధవారం చందుర్తి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. విద్యుత్ కోతలతో పంటలకు నీరు అందక ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు సాగు అవసరాల కోసం నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా జనరల్ సెక్రటరీ సిరికొండ శ్రీనివాస్, చందుర్తి మండల అధ్యక్షుడు మొకినపల్లి విజేందర్, ఎస్టీ మోర్చా జనరల్ సెక్రటరీ తిరుపతి, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.