Take a fresh look at your lifestyle.

భూ సుపోషణతోనే భూసంరక్షణ సాధ్యం

0 3

మండల వ్యవసాయ అధికారి శ్వేత కుమారి

మెట్రో న్యూస్ కొల్చారం:

భూ సుపోషణ మరియు భూసంరక్షణలో భాగంగా కొల్చారం మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో ఈరోజు కేతి బచావ్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి శ్వేత కుమారి మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావం దృష్ట్యా రైతులు ఆరుతడి పంటలైన జొన్న, మొక్కజొన్న, కుసుమ, పొద్దుతిరుగుడు వంటి పంటలను సాగు చేయాలని సూచించారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి భూసారాన్ని కాపాడుకోవాలని తెలిపారు.
సమగ్ర పోషక యాజమాన్య పద్ధతుల్లో భాగంగా పచ్చిరొట్ట ఎరువుల పంటలు, జీవ ఎరువులు, సూక్ష్మ పోషకాలను వినియోగించి నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలని రైతులకు వివరించారు.
అలాగే మట్టి నమూనాల సేకరణ, పరీక్షల విధానం, వాటి ప్రయోజనాలను వివరించారు. భూసార పరీక్షల ఫలితాల ఆధారంగా పంటలకు అవసరమైన పోషకాలను అందించి సమతుల్య ఎరువుల యాజమాన్య పద్ధతులను పాటించాలని రైతు సోదరులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి గౌతమి, గ్రామ సర్పంచ్ లతశ్రీ శేఖర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి రైతులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.