(మెట్రో న్యూస్):
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం (ఫ్లాగ్ డే) సందర్భంగా బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలు సమర్పించి అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల సేవలను స్మరించుకున్నారు. ప్రజల భద్రత, సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ కోసం పోలీసులు ఎదుర్కొనే సవాళ్లు, విధి నిర్వహణలో ప్రదర్శించే ధైర్యసాహసాలు, అంకితభావం దేశ ప్రజలకు భరోసానిస్తాయని పేర్కొన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజల రక్షణకు అంకితమైన అమరవీరుల త్యాగాలు పోలీస్ శాఖకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని తెలిపారు.
దేశంలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణ కోసం విధి నిర్వహణలో తమ అమూల్యమైన ప్రాణాలను త్యాగం చేసిన పోలీస్ అమరవీరుల సేవలు చిరస్మరణీయమని జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు, ఐపీఎస్, పేర్కొన్నారు.
అనంతరం జిల్లా అదనపు ఎస్పీ శ్రీ కె. శంకర్ ఈ ఏడాది విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వివిధ రాష్ట్రాలకు చెందిన 154 మంది పోలీస్ అమరవీరుల పేర్లను చదివి వినిపించారు. ఈ సందర్భంగా అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి ఘనంగా నివాళులర్పించారు. దేశ ప్రజల భద్రత కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, వారి సేవా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించాలని ఈ సంస్మరణ దినం సందేశాన్నిస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ కె. శంకర్, గద్వాల డీఎస్పీ మొగిలయ్య, సాయుధ దళాల డీఎస్పీ నరేందర్ రావు, అలంపూర్, గద్వాల్, శాంతినగర్ సీఐలు శ్రీ ప్రదీప్, శ్రీనివాస్, శంకర్, ఆర్ఐలు శ్రీ నరేష్, వెంకటేష్, హరీఫ్, ఆర్ ఎస్సైలు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు, వివిధ విభాగాల అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.