Take a fresh look at your lifestyle.

గ్రామీణ ప్రజలకు నాణ్యమైన నేత్ర వైద్య సేవలు

0 2

(మెట్రో న్యూస్)

సంస్థ కృషి ప్రశంసనీయం: ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి

నాగర్ కర్నూల్ మండలం తూడుకుర్తి గ్రామంలోని కూచుకుళ్ల రామచంద్రారెడ్డి ఐ సెంటర్ 28వ వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు.ఎల్ వీ ప్రసాద్ ఐ ఇన్ స్టిట్యూట్ కు అనుబంధంగా నడుస్తున్న ఈ కేంద్ర వార్షికోత్సవానికి ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి,జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి మాట్లాడుతూ, గత 28 ఏళ్లుగా గ్రామీణ,మారుమూల ప్రాంత ప్రజలకు నాణ్యమైన నేత్ర వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో ఐ సెంటర్ కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు.తన తండ్రి పేరుతో నిర్వహిస్తున్న కేంద్రం ద్వారా ప్రజలకు ప్రయోజనం చేకూరడం సంతృప్తినిస్తోందని,సంస్థ సేవలను మరింత విస్తరించాలని ఆకాంక్షించారు.
కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్  మాట్లాడుతూ ఎమ్మెల్సీ చొరవతో ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన నేత్ర సేవలు అందుతున్నాయని కొనియాడారు.కంటి చూపు ప్రతి మనిషి జీవితంలో ఎంతో విలువైనదని,సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు ముందస్తు పరీక్షల ద్వారా వ్యాధులను తొలిదశలోనే గుర్తించవచ్చని తెలిపారు.సేవాభావంతో పనిచేస్తున్న వైద్యులు,సిబ్బందిని అభినందించారు.అనంతరం ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగిని నగదు బహుమతి,ప్రశంసాపత్రంతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర,తహసిల్దార్ తబితా రాణి,సర్పంచ్ లక్ష్మి, కరుణాకర్ రెడ్డి,ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది,ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.