IND vs SL : కొలంబో టెస్టులో సొనాల్ దినుష(92నాటౌట్) ఒంటరి పోరాటం కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో శతకంతో మెరిసిన ఈ కుర్రాడు.. ఐదో రోజూ భారత బౌలర్లకు కొరకరాని కొయ్యలా మారాడు.

IND vs SL : కొలంబో టెస్టులో సొనాల్ దినుష(92నాటౌట్) ఒంటరి పోరాటం కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో శతకంతో మెరిసిన ఈ కుర్రాడు.. ఐదో రోజూ భారత బౌలర్లకు కొరకరాని కొయ్యలా మారాడు. క్రీజులో పాతుకుపోయిన దినుష.. విలువైన భాగస్వామ్యాలతో లంక ఆధిక్యాన్ని170కి పెంచాడు. అతడి సంకల్పంతో ఆతిథ్య జట్టుకు డ్రాపై ఆశలు చిగురించాయి. దాంతో, టీ బ్రేక్ సమయానికి 8 వికెట్ల నష్టానికి 383 రన్స్ కొట్టింది ఆతిథ్య జట్టు.
ఐదోరోజు శ్రీలంకను త్వరగా ఆలౌట్ చేసి.. సిరీస్‌ను ఓడిసిపట్టాలనుకున్న భారత జట్టుకు సొమాల్ దినుష(98 నాటౌట్) అడ్డుగోడలా మారాడు. రెండు సెషన్లలోనూ భారత బౌలర్లను నీరసించేలా చేసిన దినుష.. శతకానికి చేరువయ్యాడు. నువాంత(46)తో సెంచరీ భాగస్వామ్యంతో.. ఆపై లహిరు కుమార(2 నాటౌట్)తో కీలక రన్స్ సాధించాడు.
లంచ్ తర్వాత మానవ్ సుతార్ ఓవర్లో నువాంత ఔటవ్వడంతో భారతజట్టు ఊపిరి పీల్చుకుంది. కాసేపటికే.. జడేజా బౌలింగ్‌లో వికెట్ ఇచ్చేశాడు. దాంతో.. లంకను చుట్టేయాలనుకున్న టీమిండియా స్పిన్నర్లు, పేసర్లను దీటుగా ఎదుర్కొన్నాడు దినుష ఆలౌట్ ప్రమాదంలో పడినందున కుమార, దినుష ద్వయం ఏకంగా 99 బంతులు ఎదుర్కొని.. 22 రన్స్ రాబట్టారంతే. తొలి ఇన్నింగ్స్‌లో (103 రన్స్‌తో మెరిసిన దినుష.. పట్టుదలతో 329/6 తో భోజన విరమానికి వెళ్లిన లంక.. 383/8తో రెండో సెషన్‌ను ముగించింది).