మెట్రో న్యూస్:
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి పండుగ అని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి ఆకాంక్షించారు.విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం,మహబూబ్‌నగర్ పట్టణంలోని బాయ్స్ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన దసరా ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మేయర్ గుమ్మల మమత శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మాజీ మార్కెట్ చైర్మన్ బెక్కరి అనిత మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సిరాజ్ ఖాద్రి, రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ రవికుమార్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక,పూజలు,నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెస్సార్,మాట్లాడుతూ,విజయదశమి ధర్మం, న్యాయం, సత్యం ఎల్లప్పుడూ విజయం సాధిస్తాయని చాటిచెప్పే పండుగ అని పేర్కొన్నారు. జగన్మాత దుర్గాదేవి, శ్రీరామచంద్రుడిఆశీస్సులతో పాలమూరు,ప్రజలందరూఅష్టైశ్వర్యాలతో సంతోషంగా జీవించాలని ప్రార్థించినట్లు తెలిపారు. మహబూబ్‌నగర్ పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, ప్రజలు సోదరభావంతో, ఐకమత్యంతో మెలగాలని ఆకాంక్షించారు.దసరా ఉత్సవాలతో బాయ్స్ జూనియర్ కళాశాల మైదానం పండుగ శోభను సంతరించుకుంది. ఈ వేడుకల్లో వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, దసరా ఉత్సవ కమిటీ నిర్వాహకులు, కాంగ్రెస్ నాయకులు,ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, స్థానిక ప్రజలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.