హైదరాబాద్ (మెట్రోన్యూస్):
- ప్రయాణికుల సౌకర్యమే లక్ష్యంగా కామన్‌పాస్
ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్‌తో ప్రయాణం మరింత సులభతరంగా ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. మంత్రుల బృందం శనివారం ఉదయం బేగంపేట నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వరకు కామన్ పాస్‌తో ప్రయాణించింది. ప్రజా భవన్ నుండి ఆర్టీసీ బస్‌లో బేగంపేట మెట్రో స్టేషన్‌కు వెళ్లిన మంత్రులు, అధికారులు మెట్రో రైలులో జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వరకు ప్రయాణించారు.


మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట్ స్వామి, అజారుద్దీన్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి,ఎమ్మెల్యేలు శ్రీ గణేష్ , నవీన్ యాదవ్,స్పెషల్ చీఫ్ సెక్రెటరీ వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి కామన్‌పాస్ ఉపయోగించుకున్నారు. కామన్ పాస్ ప్రయోజనాలను స్వయంగా పరిశీలించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ఒకే పాస్‌తో మెట్రో–ఆర్టీసీ ప్రయాణం ప్రయాణికులకు సౌకర్యవంతమైన విధానం అని తెలిపారు. మెట్రో–ఆర్టీసీ అనుసంధానాన్ని మరింత విస్తరిస్తాం అని తెలిపారు. భవిష్యత్‌లో మెట్రో–ఆర్టీసీతో పాటు ఆటోలు, ఊబర్ సేవలను అనుసంధానించే ఆలోచన ఉందన్నారు. ప్రజా రవాణా వ్యవస్థను సమగ్రంగా అనుసంధానం చేస్తామన్నారు. ప్రయాణికుల సౌకర్యమే లక్ష్యంగా ఆర్టీసీ మెట్రో కామన్ పాస్ తీసుకొచ్చామన్నారు.