(మెట్రో న్యూస్):
- మిగిలిన పనులకు ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ అండ
- ముదిరాజ్ సంఘం నాయకులకు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి హామీ
వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామంలోని పెద్దమ్మ గుడి నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ ముందుకు వచ్చింది. గుడి నిర్మాణ పనులు దాదాపు సగం పూర్తికాగా, మిగిలిన పనులను కూడా పూర్తి చేయాలని ముదిరాజ్ సంఘం నాయకులు కోరడంతో ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి సానుకూలంగా స్పందించారు.
మైలారం గ్రామంలో పరుపాటి శ్రీనివాస్ రెడ్డిని ముదిరాజ్ సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. పెద్దమ్మ గుడి నిర్మాణానికి సంబంధించి మిగిలిన పనులను పూర్తి చేయాలని కోరగా, ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పనులను పూర్తి చేయిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
ఈ హామీపై ముదిరాజ్ సంఘం పెద్దమనుషులు, సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు బాధ అశోక్, ఉపాధ్యక్షుడు గొడుగు నర్సయ్య, కార్యదర్శి బోయిని రంజిత్లను పరుపాటి శ్రీనివాస్ రెడ్డి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
పెద్దమ్మ గుడి నిర్మాణ పనుల పూర్తికి హామీ ఇవ్వడంతో గ్రామంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.