మహిషాసురమర్దిని, ఆదిపరాశక్తి స్వరూపిణి శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దివ్య వైభవానికి, మైసూరు రాజసంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే మ త్సవం మైసూరు దసరా.కర్ణాటకలోని చాముండి కొండపై వెలసిన శ్రీ చాముండేశ్వరి అమ్మవారు మైసూరు రాజవంశానికి ఆరాధ్యదేవతగా ప్రసిద్ధి చెందారు. కన్నడిగులు ఈ కొండను చాముండి బెట్ట అని పిలుస్తారు. అమ్మవారి దర్శనం కోసం దేశం నలుమÖలల నుంచి భక్తులు తరలివస్తుంటారు. విజయదశమి నాడు బంగారు అంబారీలో అమ్మవారి ఉత్సవమÖర్తిని అలంకరించిన ఏనుగుపై ఊరేగింపుగా తీసుకువెళ్లే జంబూ సవారి మైసూరు దసరా ఉత్సవాల్లో ప్రధాన ఆకర్షణ. బంగారు సింహాసనం, విద్యుద్దీపాలతో ధగధగలాడే మైసూరు ప్యాలెస్, డొల్లు కుణిత, కరగ నృత్యం,యక్షగానం వంటి సంప్రదాయ కళారూపాలు ఈ వేడుకకు మరింత శోభను చేకూరుస్తాయి.భక్తి, రాజవైభవం, కన్నడ సంస్క ృతీ సంపదల సమ్మేళనమైన ఈ మ త్సవం ధర్మంపై అధర్మం సాధించిన పరమ విజయానికి ప్రతీక.శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దివ్యకటాక్షంతో సర్వేజనాః సుఖినో భవంతు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.