(మెట్రో న్యూస్):
ప్రజల సమస్యల పరిష్కారమే వేదికగా సాగుతున్న ప్రజావాణి కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్ఛి ప్రజావాణి దరఖాస్తులను అధికారులు సత్వరమే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ బి హరిసింగ్ అన్నారు. సోమవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రతి సోమవారం జరుగు ప్రజావాణి కి జిల్లా స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని, ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా మండల స్థాయి ప్రజావాణి దరఖాస్తులను తప్పనిసరిగా ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేయాలని స్పష్టం చేశారు. ప్రజావాణి పోర్టల్‌లో ఇంకా పరిష్కారం కాకుండా ఉన్న దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ తెలిపారు. కొత్తగా అందుతున్న దరఖాస్తులను ఎప్పటికప్పుడు పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రజావాణిలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను తక్షణమే పరిష్కరించేలా సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని తెలిపారు. ప్రతి అధికారి తమ లాగిన్ లో ఉన్న పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని అన్నారు. ప్రజలు పెట్టుకున్న అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా, నిర్ణీత గడువులోగా వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
మండల స్థాయిలో ప్రారంభమైన ప్రజావాణి కి అన్ని శాఖల మండల స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరయ్యేలా జిల్లా అధికారులు పర్యవేక్షించాలని అన్నారు. మండల స్థాయి సమస్యలు స్థానికంగానే పరిష్కారమైతే ప్రజలకు ఇబ్బందులు తప్పుతాయని ఆయన పేర్కొన్నారు.
సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం లో భూ సమస్యలకి 12, రెవిన్యూ కి సంబందించి 1 దరఖాస్తు, డిపిఓ 2, , డిఇఓ 2 మిగిలిన 8 దరఖాస్తులు వివిధ శాఖలకి చెందినవని, మొత్తం 25 దరఖాస్తులు వచ్చాయాని వాటిని పరిష్కరించేందుకు శాఖల వారీగా పంపించటం జరిగిందని అడిషనల్ కలెక్టర్ ఈ సందర్బంగా అన్నారు.
ఈ కార్యక్రమానికి డిఆర్ఓ ప్రేమ్ రాజ్, డిఆర్డిఓ పిడి సన్యాసయ్య, సి పి ఓ కిషన్, డిఎంహెచ్వో వెంకటరమణ, డిఏఓ శ్రీధర్ రెడ్డి, జిల్లా స్పోర్ట్స్ అండ్ యూత్ వెల్ఫేర్ అధికారి వెంకటరెడ్డి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.