Take a fresh look at your lifestyle.

ఉప్పల్‌లో రూ.3.22 కోట్లతో అత్యాధునిక సిటీ బస్ టెర్మినల్ నిర్మాణం

0 8

హైదరాబాద్ : మెట్రో న్యూస్

మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోడుప్పల్ సర్కిల్–10, ఉప్పల్ జోనల్ వర్క్‌షాప్ వద్ద పాత ఉప్పల్ బస్ డిపో స్థలంలో రూ.3.22 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న అత్యాధునిక సిటీ బస్ టెర్మినల్ నిర్మాణ పనులకు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో నిర్మిస్తున్న ఈ టెర్మినల్‌ను ప్రయాణికులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి తెలిపారు. 100 రోజుల్లో నిర్మాణ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, వజ్రేష్ యాదవ్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.