Take a fresh look at your lifestyle.

ఎల్‌నినో ప్రభావం.. కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళికలు!

0 1

(మెట్రో న్యూస్)

ఎల్‌నినో ప్రభావంతో భవిష్యత్తులో ఎదురయ్యే కరువు పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికారులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ప్రత్యేక అధికారి శ్రీకాంత్ రెడ్డి సూచించారు. ఈ మేరకు మండల స్థాయి వివిధ శాఖల అధికారులతో ఆయన అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించి, రానున్న రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.
రైతులకు ముందస్తు అవగాహన కల్పించాలి
ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావం వ్యవసాయ రంగంపై అధికంగా పడే అవకాశం ఉన్నందున రైతులను ముందుగానే అప్రమత్తం చేయాలని సూచించారు. వరి పంటతో పాటు అధిక నీరు అవసరమయ్యే పంటలకు బదులుగా, తక్కువ నీటితో సాగు చేసుకునే ఆరుతడి పంటలను ఎంచుకునేలా రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. కరువు పరిస్థితులు ఏర్పడితే రైతులు ఇబ్బందులు పడకుండా వ్యవసాయ శాఖ అధికారులు తగిన సూచనలు, సలహాలు అందించాలని తెలిపారు.
తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు
గ్రామపంచాయతీల పరిధిలో రానున్న రోజుల్లో తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా ఇంజినీరింగ్ శాఖ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. తాగునీటి సరఫరా పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, అవసరమైన చోట తగిన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. అదేవిధంగా సాగునీరు, విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
భూగర్భ జలాల పెంపునకు ప్రత్యేక చర్యలు
వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించేందుకు విభిజి రాంజీ పథకం ద్వారా ఇంకుడు గుంతలు, బోరుబావుల రీఛార్జ్ నిర్మాణాలు, వ్యవసాయ కుంటలు (ఫామ్ పాండ్స్) వంటి నీటి సంరక్షణ పనులను ప్రోత్సహించాలని ప్రత్యేక అధికారి సూచించారు. ప్రజల భాగస్వామ్యంతో ఈ నిర్మాణాలను చేపట్టేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
పశుసంపద పరిరక్షణపై దృష్టి
కరువు పరిస్థితుల్లో పశువులకు తాగునీరు, పశుగ్రాసం కొరత ఏర్పడకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. పశుసంపద పరిరక్షణకు అవసరమైన చర్యలు చేపట్టడంతో పాటు, ప్రజారోగ్య పరిరక్షణకు సంబంధిత శాఖలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
ఈ సమావేశంలో మండల తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో పాక శ్రీనివాస్, వ్యవసాయ అధికారి వీరభద్రం, పశువైద్యులు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఉపాధి హామీ సిబ్బంది, ఆరోగ్య శాఖ అధికారులు, ఇరిగేషన్ ఏఈ, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ, విద్యుత్ శాఖ ఏఈ, ఏపీవో తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.