(మెట్రో న్యూస్):
ఈ రోజు జనసేన పార్టీ నర్సంపేట నియోజకవర్గ నాయకులు మేరుగు శివకోటి యాదవ్ ఆధ్వర్యంలో వరంగల్- ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నర్సంపేట పట్టణంలోని విద్యాసంస్థలైన డఫోడీల్స్ హైస్కూల్, ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాలలో జనసేన పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ గడల శ్రీనివాసరావు అభ్యర్థిత్వాన్ని వివరిస్తూ,ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పిస్తూ అధ్యాపక,ఉపాధ్యాయ పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు..ఈ కార్యక్రమంలో గాండ్ల అరుణ్ జనసేన పార్టీ నర్సంపేట సెక్రెటరీ, జనసేన నాయకులు గంగుల రంజిత్,బొబ్బ పృథ్వీరాజ్,రోడ్డ శ్రీకాంత్ మరియు డఫ్ఫోడిల్స్ విద్యాసంస్థల చైర్మన్ చింతల నరేందర్ గారు,ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు పొరిక కృష్ణమోహన్, మల్లేష్ చంద్ర,వెంకటరెడ్డి గార్లు,తదితర అధ్యాపక,ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.