Take a fresh look at your lifestyle.

యాసంగిలో వరి సాగు చేయవద్దు.. ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మళ్లాలి …. జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్

0 16

(మెట్రో ఈవెనింగ్)

  • ఖమ్మం జిల్లాలో ప్రాథమిక అంచనాల ప్రకారం 17 మండలాల్లో కరువు ప్రభావం
  • యాసంగిలో సాగునీటి విడుదల ఉండదు.. త్రాగునీరు, పశువుల అవసరాలకే ప్రాధాన్యం
  • పశుగ్రాసం కొరత నివారణకు ముందస్తు ప్రణాళిక.. 15 రోజుల్లో గడ్డి విత్తనాల పంపిణీ
  • ఎస్‌ఐఆర్‌ 2026లో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పిస్తాం
  • పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు నవంబర్ 6 చివరి గడువు

ఎల్‌నినో ప్రభావం, కరువు పరిస్థితులు, ఎస్‌ఐఆర్‌ 2026, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై మీడియా సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్

ఖమ్మం జిల్లాలో నెలకొన్న ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులు యాసంగి సీజన్‌లో వరి సాగు చేయకుండా, చిరు ధాన్యాలు, పప్పుధాన్యాలు, తదితర ఆరుతడి పంటల సాగు వైపు మళ్లాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ సూచించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిని త్రాగునీరు, పశువుల అవసరాలకు వినియోగించాల్సి ఉన్నందున యాసంగిలో ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువుల నుంచి సాగునీటి విడుదల ఉండదని స్పష్టం చేశారు.

శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సిపి సునీల్ దత్‌, అదనపు కలెక్టర్ పి శ్రీనివాస రెడ్డి లతో కలిసి ఎల్‌నినో ప్రభావం, ఎస్‌ఐఆర్‌ 2026, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ మీడియా సమావేశం నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ* ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ముందస్తుగానే రైతులకు అవగాహన కల్పిస్తూ ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు ప్రోత్సహించామని తెలిపారు.

జిల్లాలో 17 మండలాల్లో సాధారణం కంటే 20 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని, కరువు ప్రభావిత ప్రాంతాలను గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించినట్లు చెప్పారు. ప్రాథమిక అంచనాల ప్రకారం 17 మండలాల్లో కరువు పరిస్థితులు ఉండవచ్చని గుర్తించామని, వీటిలో 10 మండలాల్లో తీవ్ర కరువు, ఏడు మండలాల్లో సాధారణ కరువు పరిస్థితులు ఉన్నట్లు వివరించారు. గత వర్షాకాలంలో భూగర్భ జలమట్టం సుమారు 2.5 మీటర్ల లోతులో ఉండగా, ప్రస్తుతం 3.56 మీటర్ల లోతుకు పడిపోయిందని తెలిపారు. కామేపల్లి, ఎర్రుపాలెం, సత్తుపల్లి, ఏన్కూరు మండలాల్లో భూగర్భ జలాలు 5 నుంచి 10 మీటర్ల లోతుకు పడిపోయాయని పేర్కొన్నారు. ఇటీవల తుఫాను ప్రభావంతో కురిసిన వర్షాల వల్ల కొంత మేర భూగర్భ జలాలు పెరిగినప్పటికీ, రాబోయే 15 రోజుల్లో జల మట్టాలు మరింత తగ్గే అవకాశం ఉందని తెలిపారు.

గత వానాకాలంతో పోలిస్తే అధికారుల అవగాహన కార్యక్రమాల ఫలితంగా జిల్లాలో వరి సాగు విస్తీర్ణం సుమారు 90 వేల ఎకరాలు తగ్గి, ఇతర పంటలు వేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. బోరుబావులపై ఆధారపడి వరి సాగు చేసిన రైతులు కూడా ప్రస్తుతం నీటి కొరత కారణంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉందన్నారు.
రాబోయే వర్షాకాలం వరకు తగిన వర్షాలు కురిసే అవకాశాలు పరిమితంగా ఉన్నందున రైతులు యాసంగిలో వరి సాగుకు దూరంగా ఉండాలని సూచించారు. చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలను సాగు చేయాలని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.