(మెట్రో న్యూస్)
వరంగల్–నల్గొండ–ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటరు నమోదు ప్రక్రియపై రాయపర్తి మండల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు జరిగిన ఈ సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఓటరు నమోదు ప్రక్రియపై వివరించారు.
ఈ సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్‌చార్జి మారపెల్లి సుధీర్ కుమార్ మాట్లాడుతూ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అర్హులైన పట్టభద్రులందరూ తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. నవంబర్ 6వ తేదీ వరకు నమోదు చేసుకునే అవకాశం ఉన్నందున అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ విషయాన్ని తెలియజేసి, నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు.
పట్టభద్రుల ఓటరు నమోదుపై విస్తృత అవగాహన కల్పించాలి బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు, ఎస్ఆర్‌ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, మండలంలోని అన్ని గ్రామాల్లో అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకునేలా పార్టీ నాయకులు, గ్రామ పార్టీ ఇన్‌చార్జులు చొరవ తీసుకోవాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రాయపర్తి మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, వివిధ గ్రామాల పార్టీ ఇన్‌చార్జులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.