Take a fresh look at your lifestyle.

రైతులకు సక్రమంగా విద్యుత్ సరఫరా అందించాలి….

0 14

(మెట్రో న్యూస్) :

జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలోని పిఎన్ఆర్ గార్డెన్ లో బిఆర్ఎస్ నాయకులు శుక్రవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ సింగరేణి ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలనీ, తెలంగాణ రైతులకు సక్రమంగా విద్యుత్ సరఫరా చేయాలని, కరెంటు కోతలతో పంటలు నష్టపోతున్న రైతులకు తక్షణ సహాయం అందించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. వ్యవసాయ విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, బొగ్గు నిల్వలు, సింగరేణి నిర్వహణ అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. వ్యవసాయానికి నిరంతర విద్యుత్ అందించడంలో ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని సూచించారు.

విద్యుత్ కోతల వల్ల పంటలు నష్టపోతున్న రైతులను గుర్తించి పరిహారం అందించాలని, కాలిపోయిన మోటార్లు, దెబ్బతిన్న ట్రాన్స్‌ఫార్మర్లను వెంటనే మరమ్మతు చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో సుమారు 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయమైందన్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని కోరారు. విద్యుత్ ఉత్పత్తి, బొగ్గు నిల్వలు, సరఫరా పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయడంతో పాటు సింగరేణి వాటాల విక్రయం, ప్రైవేటీకరణపై ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలని అన్నారు. రైతులకు సక్రమంగా విద్యుత్ అందించేలా గడువుతో కూడిన కార్యాచరణ ప్రకటించాలని, రైతాంగానికి న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ తరఫున పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు గాగోజీ చారి, మకిలి దాస్, గంగారెడ్డి, సుప్రియ – హరీష్ రెడ్డి, మకిలి కావేరి – కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.