Take a fresh look at your lifestyle.

ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం

0 10
  • గుండేడులో అండర్ డ్రైనేజ్, సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన
  • లబ్ధిదారులకు.. రేషన్ కార్డుల పంపిణీ

బాలానగర్ మండలంలోని గుండేడు గ్రామంలో సోమవారం ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి రేషన్ స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు. అనంతరం హెచ్ఎండిఏ రూ.1.5కోట్లతో అండర్ డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. నేరళ్లపల్లి గ్రామానికి వెళ్లే దారిలో నూతనంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉండి నిరుపేదలకు రేషన్ కార్డులు ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇల్లు, సన్న బియ్యం, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు వంటి పథకాలతో పేదలకు లబ్ధి చేకూరుస్తుందన్నారు. ప్రజా సంక్షేమం కోసం ప్రతినిత్యం తాను కృషి చేస్తున్నన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ నాయక్, మండల ఓబీసీ సెల్ అధ్యక్షులు పొట్లపల్లి యాదయ్య, టీ.పీసీసీ సమన్వయకర్త దత్తాత్రేయ, సర్పంచులు డీజే శ్రీను నాయక్, సర్పంచ్ శశివర్ణ పవన్ కుమార్, కేతావత్ వెంకటేష్ నాయక్, శివ, హరి సింగ్, జటావత్ రాజు నాయక్, కుమార్ నాయక్, తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి, నాయకులు లోకేష్ రెడ్డి, వెంకట్ రెడ్డి, రఫిక్, మోహన్ నాయక్, శివ నాయక్, భాస్కర్ నాయక్, కోట్ల మురళి, లస్కర్ నాయక్, వెంకట్ నాయక్, గ్రామ వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.