(మెట్రో న్యూస్)
నర్సంపేట నెక్కొండ మండలం దీక్షకుంట్ల గ్రామంలో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో నిర్మించనున్న 33/11 కె.వి. విద్యుత్ ఉపకేంద్రానికి నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి శంకుస్థాపన చేశారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ విద్యుత్ ఉపకేంద్రం అందుబాటులోకి వస్తే పరిసర గ్రామాల ప్రజలకు, రైతులకు విద్యుత్ సరఫరాలో మెరుగైన సేవలు అందడంతో పాటు, వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ అందించేందుకు దోహదపడుతుంది. స్థానికంగా విద్యుత్ సమస్యలను తగ్గించి, రైతులకు మరియు ప్రజలకు మరింత మెరుగైన విద్యుత్ సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ ఉపకేంద్రాన్ని నిర్మించనున్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, స్థానిక నాయకులు, విద్యుత్ శాఖ అధికారులు, పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.