(మెట్రో న్యూస్):
వాహనదారులు ఆర్కే-4 గడ్డ రోడ్డు మీదుగా వెళ్లాలి
మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ
క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ రాజీవ్ చౌక్ వద్ద కల్వర్టు నిర్మాణ పనులు చేపడుతున్న నేపథ్యంలో మూడు రోజుల పాటు వాహనాల రాకపోకలను దారి మళ్లించనున్నారు. ఈ మేరకు క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు, వాహనదారులు ఈ మార్పును గమనించి సహకరించాలని అధికారులు సూచించారు.
రాజీవ్ చౌక్ వద్ద కల్వర్టు నిర్మాణ పనులు నేటి నుంచి మూడు రోజుల పాటు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో రామకృష్ణాపూర్ నుంచి గోదావరిఖనికి వెళ్లే వాహనాలు సింగరేణి ఏరియా ఆసుపత్రి మార్గం గుండా వెళ్లకుండా ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకోవాలని సూచించారు. వాహనదారులు ఆర్కే-4 గడ్డ రోడ్డు మీదుగా గోదావరిఖని వైపు వెళ్లాలని తెలిపారు.
నిర్మాణ పనుల సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా వాహనదారులు ముందుగానే ప్రత్యామ్నాయ మార్గాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ప్రజలు, వాహనదారులు ఈ విషయాన్ని గమనించి నిర్మాణ పనులు సజావుగా పూర్తయ్యేందుకు సహకరించాలని క్యాతనపల్లి మున్సిపాలిటీ కమిషనర్ మురళీకృష్ణ కోరారు.