Take a fresh look at your lifestyle.

పూల సింగిడిలా.. పాఠశాలల్లో బతుకమ్మ సందడి! రామకృష్ణాపూర్‌లో ముందస్తు సంబరాలు

0 19

(మెట్రో న్యూస్):

పట్టణంలోని పలు పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తవక్కల్ పాఠశాల, సెయింట్ జాన్స్, సెయింట్ జోసెఫ్స్ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థినులు, ఉపాధ్యాయులు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి సంబరాలు జరుపుకున్నారు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని విద్యార్థినులు బతుకమ్మ పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతూ, కోలాటాలు ఆడుతూ సందడి చేశారు. సంప్రదాయ వస్త్రధారణలో విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొనడంతో పాఠశాలల ప్రాంగణాలు పండుగ శోభను సంతరించుకున్నాయి.

ఈ సందర్భంగా పాఠశాలల కరస్పాండెంట్లు మాట్లాడుతూ.. బతుకమ్మ అంటే బతుకు అమ్మ అని, ప్రకృతితో మమేకమైన ఈ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. విద్యార్థులు చదువులో రాణిస్తూ కష్టపడి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఇలాంటి వేడుకలతో విద్యార్థుల్లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పట్ల గౌరవం పెంపొందుతుందని పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.