(మెట్రో న్యూస్) :
రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను నిర్ణీత సమయాల్లో నిరంతరాయంగా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కిసాన్ మోర్చా అధ్యక్షుడు మల్లెపల్లి రాజేందర్ రెడ్డి నేతృత్వంలో గురువారం ఈ కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఐబీ భవనం నుంచి సదరన్ ఎలక్ట్రిసిటీ కార్యాలయం వరకు నాయకులు, కార్యకర్తలు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద నిరసన తెలిపి, సంబంధిత ఏఈడీ అధికారికి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. రైతులకు సక్రమంగా విద్యుత్ సరఫరా జరగకపోవడంతో వ్యవసాయ పనులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, విద్యుత్ శాఖ అధికారులు స్పందించి రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను నిర్ణీత వేళల్లో నిరంతరాయంగా అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించి వారికి న్యాయం చేయాలని కోరారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వపురం లక్ష్మన్న, బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు గోదావరి అంజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేపాల్ రెడ్డి పాల్గొన్నారు.వీరితో పాటు రాష్ట్ర నాయకులు దీశ్పాండే, కులకర్ణి, రవీందర్, జిల్లా నాయకులు మాణిక్యరావు, రాశేకర్ రెడ్డి, జగన్, భాస్కర్, భూమన్న, కొండ లక్ష్మణ్, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి, శివ, ఉపాధ్యక్షులు రంజిత్ రెడ్డి, మోహన్ రెడ్డి, వై. రాజు, బీరంగూడ బీజేపీ నాయకుడు ఈర్ల రాజు, సంగారెడ్డి టౌన్ అధ్యక్షుడు తదితర రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు, కిసాన్ మోర్చా ప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.