Take a fresh look at your lifestyle.

నేపాల్‌లో ఆకస్మిక వరద బీభత్సం.. కొట్టుకుపోయిన ఊరు..

0 15
Nepal flood | నేపాల్‌లో ఆకస్మిక వరద బీభత్సం.. కొట్టుకుపోయిన ఊరు.. వైరల్ వీడియో

నేపాల్‌లో ఆకస్మిక వరద బీభత్సం సృష్టించింది. వరద కారణంగా ఒక ఊరు కొట్టుకుపోయింది. ఈ ఘటన నేపాల్-టిబెట్ సరిహద్దులోని రసువా జిల్లాలోని ఒక గ్రామంలో బుధవారం ఉదయం 9.00 గంటలకు జరిగింది. ఆకస్మికంగా సంభవించి వరద కారణంగా ఊరు కొట్టుకుపోగా.. ఊరిలోని 1,000 మంది వరకు ఇందులో కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. వీరి పరిస్థితి గురించిన సమాచారం ఇంకా వెల్లడికాలేదు.
ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు ప్రారంభించాయి. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అలాగే, చుట్టుపక్కల ప్రాంతంలోని ప్రజలు సురక్షిత, ఎగువ ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా అధికారులు సూచించారు. ఈ ఘటన జరిగింది నేపాల్‌లోని రసువా జిల్లాలోని స్యాప్రు బేసి, టిమురే ప్రాంతాల్లో. ఇది పర్వత ప్రాంతం. పైగా ఇక్కడ భోటె కోషి అనే నది ఉంది. ఈ నది టిబెట్ నుంచి నేపాల్‌వైపు ప్రవహిస్తుంది. ఈ నదిలో నీరు ఉప్పొంగడంతోపాటు, దిగువ లోయ ప్రాంతం కావడం వల్ల ఇక్కడ భారీ వరద సంభవించింది.

Leave A Reply

Your email address will not be published.