Take a fresh look at your lifestyle.

మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము

0 17

విజయవాడ :

మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము  కోరారు. విజయవాడలో గురువారం జాతీయ సరస్‌ మేళా ను ప్రారంభించి మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ గతంలో మహిళలు ఆర్థికంగా వెనుకబడి ఉండేవారు. కుటుంబ ఆలనపాలన మాత్రమే చూసుకునేవారు. చిన్న విషయాలకు ఇతరులపై ఆధారపడే పరిస్థితి ఉండేది. నేడు మహిళలు ఆత్మనిర్భరతతో పాటు ఇతరులకు ఆసరాగా నిలుస్తున్నారని కొనియాడారు.

మహిళల ఆదాయార్జన దేశ ఆర్థిక సమృద్ధికి దోహదపడుతుందని. 2047 కంటే ముందే వికసిత్‌ భారత్‌ స్వప్నం సాకారమవుతుందని వెల్లడించారు. అంతకుముందు ఆమె స్టాళ్లను పరిశీలించి, స్టాల్‌లోచీర కొనుగోలు చేసి డిజిటల్‌ చెల్లింపు చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు శివరాజ్‌ సింగ్‌ , రామ్మెహన్‌ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.