Take a fresh look at your lifestyle.

బ్రహ్మోత్సవాల్లో కల్పవృక్ష వాహనంపై మలయప్ప దర్శనం

0 22

బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజు శుక్రవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు కల్పవృక్ష వాహనం పై భక్తులకు దర్శనమిచ్చారు.తిరుమాడ వీధుల్లో అంగరంగ వైభవంగా సాగిన వాహనసేవలో పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.

క్షీరసాగర మథనంలో ఉద్భవించిన దివ్య సంపదల్లో కల్పవృక్షం ఒకటి. కోరిన ఫలాలను ప్రసాదించే కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించిన శ్రీనివాసుడు భక్తులకు సర్వాభీష్టాలను ప్రసాదించే దివ్యరూపంలో దర్శనమిచ్చారు. వాహనసేవలో తిరుమల పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, పలువురు బోర్డు సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.