Take a fresh look at your lifestyle.

గ్యాస్‌ కనెక్షన్‌ ఉన్నవారికి అలర్ట్‌.. నేటితో ముగియనున్న గడువు!

0 16
LPG Gas Connection Alert Today is the Last Date for e-KYC Completion
  • ఎల్‌పీజీ ఈ-కేవైసీకి నేటితో ముగియనున్న గడువు
  • గతంలో ఈ-కేవైసీ చేసినవారు మళ్లీ చేయాల్సిన అవసరం లేదు
  • చేయని వారికి కనెక్షన్‌ తాత్కాలికంగా నిలిచే అవకాశం
  • సబ్సిడీపై కూడా ప్రభావం పడే అవకాశం
  • ఇంటి నుంచే యాప్‌ల ద్వారా ఈ-కేవైసీ చేసే వెసులుబాటు

గ్యాస్‌ కనెక్షన్‌ ఉన్నవారికి ఈ-కేవైసీ అంశం కీలకంగా మారింది. ఇండేన్‌, భారత్‌ గ్యాస్‌, హెచ్‌పీ గ్యాస్‌ వినియోగదారులు ఆధార్‌ ఆధారిత ముఖ గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. నేటితో (2026  ఆగస్టు 31) తుది గడువు ముగియనుంది. గతంలో ఉన్న ఆగస్టు 16 గడువును పొడిగించి ఈ తేదీని ఖరారు చేశారు. అయితే ఈ నిబంధన గతంలో ఈ-కేవైసీ పూర్తి చేయని నాన్‌-పీఎంయూవై వినియోగదారులకు వర్తిస్తుంది.

ఈ-కేవైసీ ఇప్పటికే పూర్తి చేసినవారు మళ్లీ చేయాల్సిన అవసరం లేదు. గడువులోగా పూర్తి చేయని వారికి గ్యాస్‌ సేవల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా గ్యాస్‌ కనెక్షన్‌ను తాత్కాలికంగా నిలిపివేయొచ్చని సమాచారం. ఈ-కేవైసీ పూర్తి చేసిన తర్వాత కనెక్షన్‌ను తిరిగి యాక్టివేట్‌ చేస్తారు. కనెక్షన్‌ శాశ్వతంగా రద్దు చేయరు.

ఈ-కేవైసీ పూర్తి చేయకపోతే దేశీయ ధరకు గ్యాస్‌ సిలిండర్‌ పొందడంలోనూ ఇబ్బందులు రావచ్చని ఇండియన్‌ ఆయిల్‌ గతంలో తెలిపింది. కొన్ని నివేదికల ప్రకారం.. ఈ ప్రక్రియ పూర్తి చేయని వారికి దేశీయ సిలిండర్‌ బదులు వాణిజ్య ధర చెల్లించాల్సి రావొచ్చు. అర్హత ఉన్న పీఎంయూవై లబ్ధిదారుల సబ్సిడీపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది.

ఈ ప్రక్రియను ఇంటి నుంచే పూర్తి చేయొచ్చు. ఇండేన్‌ వినియోగదారులు ‘ఇండియన్‌ఆయిల్‌ వన్‌’, భారత్‌ గ్యాస్‌ వినియోగదారులు ‘హలో బీపీసీఎల్‌’, హెచ్‌పీ గ్యాస్‌ వినియోగదారులు ‘హెచ్‌పీ పే’ యాప్‌లను ఉపయోగించవచ్చు. ఆధార్‌ ముఖ గుర్తింపు కోసం ఆధార్‌ఫేస్‌ ఆర్‌డీ యాప్‌ అవసరం. యాప్‌లో రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసిన తర్వాత ఈ-కేవైసీ ఆప్షన్‌ ఎంచుకుని ముఖ స్కాన్‌ ద్వారా ప్రక్రియను పూర్తి చేయాలి.

Leave A Reply

Your email address will not be published.